గొంతెత్తిన ఇండస్ట్రీ.. ఉదృత రూపం దాల్చుతున్న ‘సేవ్ నల్లమల’ ఉద్యమం

  0
  167

  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన ‘సేవ్‌ నల్లమల’ ఉద్యమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రకృతి సంపదకు నిలయమైన నల్లమల అడవులను కాపాడుకుందామంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్‌లు చేస్తున్నారు.

  Related image

  ప్రముఖ పిటిషన్‌ వెబ్‌సైట్‌ change.org ద్వారా ఆన్‌లైన్‌లో సంతకాలు సేకరిస్తున్నారు. పిటిషన్‌ లింక్‌ను వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. తెలంగాణ డీవైఎ్‌ఫఐ శాఖ ప్రారంభించిన ఆన్‌లైన్‌ సంతకాల సేకరణలో.. ఒక్కరోజులోనే 30 వేల మంది డిజిటల్‌ సంతకాలు చేసారంటే ఈ సమస్య తీవ్రత ఎంత మందిని కదిలించిందో అర్ధమవుతుంది. ఈ పిటిషన్‌ లింక్‌ను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అధికారిక ట్విటర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేస్తున్నారు.

  Image result for samantha adivi sesh

  సినీనటుడు అడివి శేష్‌, నటి సమంత.. దీనిని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మేం సంతకాలు చేశాం..మీరూ చేయండి’ అని పోస్ట్‌ చేశారు. కాగా, ‘అమెజాన్‌ అడవులు కాలిపోతుంటే స్పందించిన వాళ్లం… మన నల్లమల ధ్వంసమవుతుంటే మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాం. స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని నటుడు మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రతి పౌరుడూ స్పందించాలని మరో నటుడు రామ్‌ పిలుపునిచ్చారు. కాగా వరుణ్‌తేజ్‌, సాయిధరమ్ తేజ్‌, అనసూయ.. ‘సేవ నల్లమల’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

  Image result for save nallamala

  మరోవైపు నల్లమలను కాపాడేందుకు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ ముందుకు రావాలని మరో దర్శకుడు వి.వి.వినాయక్‌ కోరారు. కాగా నటులు పవన్‌కల్యాణ్‌, విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ, దర్శకులు శేఖర్‌ కమ్ముల, సురేందర్‌రెడ్డి, నాగ్‌ అశ్విన్‌ తదితరులు ఇప్పటికే ‘సేవ్‌ నల్లమల’ ఉద్యమానికి మద్దతు తెలిపారు.