ఆరోగ్య సమస్యను బయటపెట్టిన ‘మహేష్ బాబు’

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు అభిమానుల ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. అయితే ప్రముఖ సినీ సెలబ్రిటీలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ, ఇతర సమస్యలు

0
186

ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు అభిమానుల ఫాలోయింగ్ ఇంతా అంతా కాదు. అయితే ప్రముఖ సినీ సెలబ్రిటీలకు ఎలాంటి  ఆరోగ్య సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ ఉండవని అందరు అనుకుంటారు. డబ్బులన్నవాళ్లు కాబట్టి ఎలాంటి  సమస్యలు ఉండవని అనుకుంటారు. కానీ వారూ మనుషులే. వారికీ అనారోగ్య సమస్యలు చాలానే ఉంటాయి.  తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తనకున్న అనారోగ్య సమస్య గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేశారు. ఆయన ఒకప్పుడు విపరీతమైన మైగ్రేన్ సమస్యతో బాధపడ్డారని చెప్పారు. ఆ సమస్య నుంచి బయట పడేందుకు ఎందరో వైద్యులను సంప్రదించినా…ఏ మాత్రం నయం కాలేదని అన్నారు. కానీ ఆ ఆరోగ్య సమస్య.. చక్రసిద్ధ నాడి వైద్యంతో నయమైనట్లు చెప్పుకొచ్చారు.

‘ఈ మైగ్రేన్ సమస్య ఒక్కసారి వచ్చిందంటే విడిచిపెట్టదు. ఈ సమస్య నుంచి బయట పడాలంటేనే చాలా కష్టం. అసలు ఈ సమస్య తగ్గడానికి ఎలాంటి నివారణే లేదు. ఎందరో వైద్యులకు చూపించుకున్నాను. కానీ సమస్య నయం కాలేదు. చివకు ఓ సారి నా భార్య నమ్రత తన స్నేహితురాలి ద్వారా డాక్టర్‌ సింధూజ వద్దకు వెళ్లాము. నాకున్న మైగ్రేన్ సమస్య గురించి ఆమెకు వివరించాము. అప్పుడు ఆవిడ మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గిస్తాననని మాట ఇచ్చారు.అలా నేను డాక్టర్ ను కలిశాను. ఆవిడకు చక్రసిద్ద నాడీ వైద్యం గురించి తెలుసు. ఆమె నాకు అందించిన చికిత్స ఏంటో తెలియదు కానీ..నాలుగైదు సార్లు చికిత్స తీసుకున్న తర్వాత నాకున్న మైగ్రేన్ పూర్తిగా నయమైపోయింది. ఇప్పుడున్న టాబ్లెట్లు కేవలం నొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తాయి. అది సరైన పద్ధతి కాదు. నేను నొప్పి తట్టుకోలేక విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకునేవాడినని చెప్పారు. నేను సత్య సింధూజ వద్ద చికిత్స తీసుకున్నాక అసలు మైగ్రేన్ వల్ల టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎలాంటి టాబ్లెట్లు తీసుకోకుండా ఇతర చికిత్సల ద్వారా అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చనేది నేను నమ్మే సిద్ధాంతం. నాలాగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారికి ఎలా నివారించుకోవాలో తెలియాలనే నేను ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడటానికి ఒప్పుకొన్నాను..అని మహేష్ తెలిపారు. నా కుటుంబీకులు, నా స్టాఫ్ మెంబర్స్‌కి మాత్రమే నాకు మైగ్రేన్ ఉందని తెలుసు. నేను నా వర్క్ ద్వారానే మెడిటేషన్ చేస్తుంటాను. నేను చేసే పనిలో అలసట ఉంటేనే అది నాకు కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఈ నాడీ వైద్యం గురించి ప్రచారం కల్పిస్తున్నానని అనుకోకపోతే ఎన్ని చికిత్సలు తీసుకున్నా మైగ్రేన్‌ వల్ల చాలా కాలంగా బాధపడుతున్నవారు ఒకసారి చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి తెలుసుకోండి. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను కాబట్టి మీరూ కోలుకుంటారన్న నమ్మకం నాకుంది’ అని పేర్కొన్నారు మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.