స్టీవెన్ స్మిత్.. ది సేమ్ స్టోరీ రిపీట్.. ఒక్కడే నిలకడగా..

0
163

యాషెస్ సిరీస్‌లో ఇరగదీస్తున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్మిత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 294/9తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మిచెల్ మార్ష్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే జాక్ లీచ్ (21) బౌల్డయ్యాడు. దీంతో అదే స్కోరు వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన స్మిత్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి పరుగుల వేగం పెంచాడు.

Image result for steve smith

అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మిత్ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 147/4. స్మిత్ 59, మార్ష్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే ఆస్ట్రేలియా ఇంకా 147 పరుగులు వెనకబడి ఉంది.