డోసు పెంచిన లోకేష్.. నయా నియంత అంటూ.. జగన్ పై

0
66

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తన చేతగాని పాలనని దొంగ పేపర్, దొంగ ఛానల్ కాపాడలేవని.. దొంగబ్బాయ్ భయపడ్డారా? అని ట్విట్టర్‌ వేదికగా నారా లోకేష్‌ విమర్శించారు. మీడియాపై బ్యాన్‌ విధించి 100 రోజుల్లోనే తుగ్లక్ పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అంగీకరించారని లోకేష్‌ అన్నారు. అధికారమదంతో మీడియాని అణచాలనుకునే ఈ నయా నియంతని ప్రజలే బ్యాన్ చేయబోతున్నారని లోకేష్‌ సంచలన ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.