జోగు రామన్నకు క్షమాపణలు చెప్పిన యాంకర్ అనసూయ

0
316

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పకపోవడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు, శాస్త్రవేత్తలు, నటీనటులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా స్పందించిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఉన్నారు.

Related image

యురేనియం ప్రాజెక్టు వద్దంటూ ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులను ట్యాగ్ చేశారు. అయితే ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ట్యాగ్ చేసిన ఆమె.. తెలంగాణ అటవీ శాఖ మంత్రి విషయంలో తప్పులో కాలేసింది. ప్రస్తుత తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అయితే.. అనసూయ మాత్రం మాజీ అటవీ శాఖ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్నకు ట్యాగ్ చేశారు. దీంతో ఆమె ట్వీట్‌కు అందరూ కామెంట్లు చేస్తుండటంతో ఎట్టకేలకు మళ్లీ స్పందించి తప్పును సరిచేసుకున్నారు.

Image result for jogu ramanna

ఈ విషయమై అనసూయ.. జోగురామన్న అటవీ మంత్రి అని ట్యాగ్ చేసినందుకు క్షమించండి. కరెంటు అఫైర్స్ గురించి నాకు పెద్దగా తెలీదు.. పట్టులేదు కూడా. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుపై ఆలోచించండి’ అని రెండోసారి ఇంద్రకరణ్‌రెడ్డికి ట్యాగ్ చేస్తూ అనూసూయ ట్వీట్ చేశారు. కాగా.. జోగురామన్న.. టీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ రెండోసారి ఈయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదు.