అప్పుడు ఆ రెండు అట్టర్ ప్లాప్ సినిమాలు.. ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అంటూ..

0
145

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏడుపుగొట్టు చర్యలతో మరింత పతనమవుతున్నాడని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసారు.. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో… తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని.. ఇప్పుడు ఎలక్షన్ లలో ఘోర పరాజయం తర్వాత ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ సీఎం జగన్ దూసుకు పోతుంటే ఏడుపుగొండి చర్యలతో చంద్రబాబు మరింత పతనమవుతున్నాడు అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.