అదే జరిగితే అక్కడ కూడా గాంధీ జయంతిని జరుపుకోవచ్చు

    0
    95

    ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ పాక్ విషయమై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. నేడు ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. వేర్పాటు వాదుల పోరాటాలతో పాక్ అట్టుడికిపోతోందన్నారు. 1947కు ముందు ప్రపంచ పటంలో పాక్ లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లోని సింధ్, బెలూచిస్థాన్ సహా మరికొన్ని ప్రాంతాల ప్రజలు పాక్ నుంచి విడిపోయేందుకు పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ పోరాటాలతో పాక్ పరిస్థితి రోజు రోజుకీ అధ్వానంగా తయారవుతోందని.. ఒకవేళ ఆ ప్రాంతాలన్నీ పాక్ నుంచి విడిపోతే ప్రపంచ పటం నుంచి ఆ దేశం కనుమరుగవడం ఖాయమని తెలిపారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో గాంధీ జయంతిని లాహోర్ జరుపుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. కాగా.. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పీఓకేతో సహా ఆక్సాయ్‌ చిన్‌ కూడా భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.