మరో దేశం జోక్యాన్ని సహించబోం…పాక్ కు ధీటుగా బదిలిచ్చిన భారత్

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాకిస్థాన్ కు భారత ధీటుగా బదులిచ్చాయి. జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత

0
163

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాకిస్థాన్ కు భారత ధీటుగా బదులిచ్చాయి. జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.  ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు…

పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ అనంతరమే కశ్మీర్ విషయంలో మేం నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. దీనికి విస్తృత స్థాయిలో మద్దతు కూడా లభిస్తోందన్నారు. ఈ సర్వసత్తాక నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమేనని, మానవ హక్కుల పేరుతో ఇలాంటి వేదికలపై రాజకీయ విషప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఇటువంటి వేదికలపై ప్రసంగించేవాళ్లు తమ దేశంలో మైనారిటీల పట్ల ఎంత అణచివేతకు పాల్పడుతున్నారో గుర్తెరగాలని, తమ భూభాగం మీద ఉగ్రవాదానికి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతు ఇస్తున్న వాళ్లే అత్యంత దారుణంగా మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారన్నది స్పష్టమవుతోందనన్నారు.