ఫైన్ కట్టేవరకు మేకలను వదిలేది లేదు : కలెక్టర్

    0
    194

    హరితహారం మొక్కలు తిన్న మేకల యజమానులకు భారీ జరిమానా వేశారు అధికారులు. వికారాబాద్ జిల్లా చిలుకూరు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నర్సరీలో హరితహారం మొక్కలను మేకలు తిన్నాయని యజమానికి రూ. 500 జరిమానా విధించారు. ఇది గతం. లేటెస్ట్ గా ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. ఈ సారి ఫైన్ భారీగా వేశారు. హరితహారం మొక్కలు తిన్నాయని 3 మేకలను అధికారులు బంధించారు. అంతేకాదు రూ. 10 వేలు ఫైన్ కూడా వేశారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. మక్తల్ శివారులోని మునిరాబాద్ రైల్వే లైన్ లో నాటిన హరితహారం మొక్కలను 3 మేకలు తిన్నందుకు యజమానికి రూ. 10 వేలు ఫైన్ వేశారు జిల్లా కలెక్టర్ వెంకట్ రావు. డబ్బులు చెల్లించేవరకు మేకలను వదిలేది లేదని వాటిని ఎంపిడిఓ కార్యాలయంలో బంధించారు అధికారులు.