పవన్ వస్తున్నాడా..? ఆ ముగ్గురితో సినిమాలు చేస్తాడా..?

0
183

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే అయన కసరత్తు మొదలుపెట్టాడు. అయితే అయన తప్పకుండా మళ్ళీ సినిమాల్లోకి వస్తాడంటూ ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ అజ్ఞాతవాసి ప్లాప్ తరువాత పూర్తిగా రాజకీయాల్లోనే నిమగ్నమయ్యాడు. ప్రస్తుతమున్న పొజిషన్ లో జనసేన పార్టీకి క్రేజ్ రావాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడివల్లే సాధ్యం. అందుకే అయన మళ్ళీ సినిమాలు చేయాలనీ ఫ్యాన్స్ పవన్ పై ఒత్తిడి కూడా చేస్తున్నారట. ఈ విషయంలో పవన్ అయోమయంలో పడ్డాడని టాక్.

Image result for pawan kalyan

అయితే.. పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పక ముందే ఆయన మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. ఇప్పుడు ఆ కమిట్మెంట్ ప్రకారం పవన్ తో సినిమాలు చేయాలనీ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత ఏ ఎం రత్నం పవన్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఏ ఎం రత్నం నిర్మించే సినిమాకు క్రిష్ దర్శకుడిగా సెట్ అయ్యాడట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసి అది పవన్ కు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు క్రిష్. దాంతో పాటు అటు దిల్ రాజు కూడా పవన్ తో సినిమా చేయాలన్న ఆలోచన్లలో ఉన్నాడు. ఇక ఇప్పటికే మైత్రి మూవీస్ నిర్మాతలైతే ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. మొత్తానికి ముగ్గురు దర్శకులు ఇప్పటికే క్యూ లో ఉండగా.. మరో వైపు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరి ఆశ నెరవేరాలంటే పవన్ సినిమాల వైపు వస్తాడా లేక పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటాడా అనే దానిపై ఆధారపడివుంది.