కేంద్ర పాలిత ప్రాంతంగా ‘హైదరాబాద్’

తెలంగాణలోని హైదరాబాద్ కేంద్ర ప్రాంతం కాబోతోందని కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ అన్నారు. అయితే

0
186

తెలంగాణలోని హైదరాబాద్ కేంద్ర ప్రాంతం కాబోతోందని కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ అన్నారు. అయితే దీనిపై మహారాష్ట్ర  ఎన్నికల తర్వాత ప్రకటన రాబోతోందని చెప్పారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ…హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని,  రాజ్యసభలో మెజార్టీ రాగానే ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించబోతోందని పేర్కొన్నారు. తుళ్లూరులో రాజధాని  శ్రేయస్కరం  కాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినా పట్టించుకోదన్నారు. ఫలితంగా 23 సీట్లకే ఆయన పరిమితం అయ్యారన్నారు.