కన్నీటి పర్యంతమైన టీఆర్ఎస్ ఎమ్ఎల్ఏ

0
164

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కంటతడి పెట్టారు. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తారని ఆశతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.

ఆ బాధతో బీపీ అధికంగా వచ్చి ఆస్పత్రిలో చేరినట్లు స్పష్టం చేశారు. అంతేతప్ప అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కేసీఆరే తమ నాయకుడని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు.