ఆ ఐపీఎస్ అధికారిణి పెళ్లి కుదిరింది

    0
    719

    మెదక్‌ ఎస్పీగా తన పనితీరుతో అందరి దృష్టినీ అకట్టుకున్న చందనా దీప్తి విధి నిర్వహణో పలుమార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి సారి ఆమె వార్తల్లోకి వచ్చారు. వృత్తిపరంగా కాదు. ఆమెకు పెళ్లికుదిరింది. అక్టోబరులో ఆమె వివాహం జరగనుంది. ఈ మేరకు ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డికి సమీప బంధువుతో చందన పెళ్లి నిశ్చయమైంది. అక్టోబరులో వివాహం జరగనున్నట్టు సమాచారం. ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.