విలన్ గా మారనున్న ‘హెబ్బా పటేల్’

హెబ్బా పటేల్ విలన్గా మారనుంది. ఇప్పటివరకు తన అందాలతో గ్లామర్ పంట పండించిన హెబ్బా పటేల్.. హీరోయిన్గా అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె విలన్గా అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోందట

0
73

హెబ్బా పటేల్ విలన్ గా మారనుంది. ఇప్పటివరకు తన అందాలతో గ్లామర్ పంట పండించిన హెబ్బా పటేల్.. హీరోయిన్గా అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె విలన్గా అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతోందట. కుమారి 21ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్.. నితిన్ భీష్మలో నటిస్తోంది. నితిన్ హీరోగా ‘భీష్మ’అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదట ”భీష్మ”ను దసరాకి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనివార్య కారణాల ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలోనే హెబ్బా పటేల్ విలన్ గా కనిపించనుందని సమాచారం. హెబ్బా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్ అని టాక్ వస్తోంది. అదే గనుక జరిగితే ఆమె ఖాతాలో హిట్ పడుతుందని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.