వినాయక నిమజ్జనంలో అపశృతి…ఆరుగురు చిన్నారులు మృతి

    వినాయక నిమజ్జనం సందర్భంగా విషాధం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఆరుగురు చిన్నారులు

    0
    808

    వినాయక నిమజ్జనం సందర్భంగా విషాధం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఆరుగురు విగ్రహంతో చెరువులో దిగారు. ఇద్దరు ఒడ్డున నిల్చున్నారు. విగ్రహాన్ని పట్టుకుని చెరువులోకి దిగిన ఆరుగురు చిన్నారులు క్రమంగా మునిగిపోతుండడంతో బయట నిల్చున్న ఇద్దరు భయంతో గ్రామంలోకి పరుగులు తీసి పెద్దలకు సమాచారం అందించారు. వారు చెరువు వద్దకు చేరుకునే సరికే చెరువులో దిగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.

    మృతి చెందిన వారిలో తేజశ్రీ (11), ఆమె 8 ఏళ్ల సోదరి రక్షిత, వైష్ణవి (12), ఆమె సోదరుడు రోహిత్ (10), రోహిత్ (10), ధనుష్ (10)లు ఉన్నారు. వీరందరూ మరథఘట్టకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.