రోహిత్, కోహ్లీల సంబంధాలపై రవిశాస్త్రి ఏమన్నాడంటే..

0
138

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు నెలకొన్నాయనే వార్తలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. ప్రపంచకప్‌ టోర్నమెంట్ నుంచి భారత నిష్క్రమణ తర్వాత వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలను జట్టు కోచ్ రవిశాస్త్రి కొట్టిపడేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘నేను దాదాపు ఐదు సంవత్సరాలుగా డ్రెస్సింగ్ రూంలో తిరుగుతున్నాను. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో.. వాళ్లు ఒకరినొకరు ఎలా అభినందించుకుంటున్నారో నాకు తెలుసు. వాళ్లు విలువలకు కట్టుబడి ఉంటారు. వాళ్లతో కలిసి ఉన్న నాకు.. వాళ్లు ఎలా ఆడుతారో నాకు తెలుసు. ఒకవేళ విబేధాలు ఉంటే.. రోహిత్ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసేవాడు కాదు. విరాట్ ఇన్ని ఘనతలు సాధించేవాడు కాదు. వాళ్లిద్దరు ఇన్నిసార్లు మంచి భాగస్వామ్యాలు చేసేవాళ్లు కాదు’’ అని శాస్త్రి తెలిపారు.