బ్రేకింగ్: కేసీఆర్ మాట తప్పారు….సంచలన వ్యాఖ్యలు చేసిన ‘నాయిని’

ముందుగా ఈటల రాజేందర్, తర్వాత రసమయి బాలకిషన్... తాజాగా మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు

0
161

– కేసీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయిని

– మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు

ముందుగా ఈటల రాజేందర్, తర్వాత రసమయి బాలకిషన్… తాజాగా మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే ‘కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా’అని కేసీఆరే అన్నారని నాయిని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటున్న వ్యాఖ్యలపై నాయిని స్పందించారు. ఆ పదవి తనకు వద్దని, అందులో రసం లేదని నాయిని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తమ ఇంటికి పెద్ద అని, తామంతా ఓనర్లమేనని అన్నారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమని నాయిని పేర్కొన్నారు.