ప్రియాంక చోప్రా నటన చూసి భర్త వెక్కి వెక్కి ఏడ్చాడట..ఎందుకంటే

దాదాపు మూడేళ్ల తర్వాత హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

0
75

దాదాపు మూడేళ్ల తర్వాత హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌తో వివాహమయ్యాక ప్రియాంక అక్కడి ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా అయిపోయారు. దాంతో అసలు ఆమె బాలీవుడ్ సినిమాలు చేస్తారా లేదా అన్న సందేహం అభిమానుల్లో కలిగింది. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రియాంక ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. షొనాలీ బోస్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రియాంక అదితి అనే తల్లి పాత్రలో నటిస్తున్నారు.

పెళ్లి సమయం దగ్గరపడేంత వరకు ప్రియాంక ఈ సినిమాతో బిజీగా ఉన్నారు. దాంతో సినిమా చిత్రీకరణ సమయంలో సెట్స్‌కు రోజూ నిక్ కూడా వచ్చేవాడట. అయితే సినిమాలో ప్రియాంక ఓ భావోద్వేగపు సన్నివేశంలో నటిస్తున్నప్పుడు నిక్ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడట. ఈ విషయాన్ని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెట్‌లో ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించి తీరా వెళ్లి చూసేసరికి నిక్.. షొనాలీ బోస్ ముందు నిలబడి కంటతడి పెడతూ కనిపించాడట. ‘ప్రియాంక నువ్వు నీ నటనతో నిక్‌ను ఏడిపించేశావ్. బహుశా సినిమా మొత్తంలో ఇదే చక్కటి సన్నివేశం’అని అరిచారట. సినిమాలో ప్రియాంక ఓ బిడ్డకు జన్మనిస్తుంది. అయితే బిడ్డకు ఇమ్యూన్ డెఫీషియన్సీ ఉంటుంది. దాంతో ఆర్థికంగా, మానసికంగా ప్రియాంక కుంగిపోతూ ఉంటుంది. తల్లీ బిడ్డ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుడు తప్పకుండా భావోద్వేగానికి గురవుతాడు. ఇందులో ప్రియాంక భర్త పాత్రలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నటించారు. సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రియాంక.. సల్మాన్ ఖాన్‌కు జోడీగా ‘భారత్’ సినిమాకు ఒప్పుకొన్నారు. కానీ అదే సమయంలో నిక్‌తో పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో ఆమె చివరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకొన్నారు. అయితే భారత్ సినిమాతో పోలిస్తే ది స్కై ఈజ్ పింక్ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఎంతో ఉంది. అందుకే స్టార్ హీరో అయిన సల్మాన్ సినిమాకు నో చెప్పారు ప్రియాంక.