డ్యాన్స్ తో ఇరగదీసిన ‘యాంకర్ అనుసూయ’ ..వీడియో మీ కోసం

అనసూయ ఈ పేరు పరిచయం అక్కర్కేనిది. న్యూస్ రీడర్ గా ప్రస్ధానం మొదలు పెట్టి ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. పేరుకు జబర్దస్త్

0
137

అనసూయ ఈ పేరు పరిచయం అక్కర్కేనిది. న్యూస్ రీడర్ గా ప్రస్ధానం మొదలు పెట్టి ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ.   పేరుకు జబర్దస్త్ యాంకర్ అయినా  హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ సంపాదించుకుంది. కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోతుంది. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. గత ఏడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని పెంచేసింది. తర్వాత అనసూయకు వరుసగా సినిమాల్లో ఛాన్సులు రావడం ప్రారంభమయ్యాయి.

ఈ యేడాది వెంకటేష్, వరుణ్ తేజ్  మల్టీస్టారర్ గా వచ్చిన ‘ఎఫ్2’  మూవీలో ఐటమ్ సాంగ్ తో చిందేసింది. ‘జబర్ధస్త్’ కామెడీ షో మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం కూడా వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది. టెలివిజన్ యాంకర్ గా ఆమె అనేక పురస్కారాలను అందుకొంది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి.

అనసూయ నటనే కాదు మంచి డ్యాన్సర్ గా కూడా నిరూపించుకుంది. పలు సినీ, టెలివిజన్ కార్యక్రమాల్లో తన డ్యాన్స్ తో అలరిస్తుంది. తాజాగా అనసూయ డ్యాన్స్ ప్రాక్టీస్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ లో అనసూయ చాలా అందంగా కనిపిస్తుంది.