టీమిండియా కోచ్ రవిశాస్త్రి జీతం ఎంతో తెలిస్తే షాకే..

0
193

కపిల్ దేవ్ నాయకత్నంలోని సలహా కమిటీ టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చింది. కొత్త ఒప్పందం ప్రకారం రవిశాస్త్రికి సుమారు 20 శాతం మేర జీతం పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వేతనం ఏడాదికి సుమారు రూ. 9.5 నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.8 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు. ఇదిలావుంటే.. కొత్త ఒప్పందం ప్రకారం టీమిండియా సహాయక సిబ్బంది వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌కు రూ.3.5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌కు రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.