జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన బాబు.. ఈ రేంజ్ లో బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా..

0
66

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. మంగళవారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాకు అడ్డూ, అదుపూ లేదని ఏమైనా చేస్తామని వైసీపీ నేతలు అనుకుంటున్నారని.. ‘తమాషానా.. తడాఖా చూపిస్తాం.. నీ అధికారం అంతు తేలుస్తాను’ అని చంద్రబాబు హెచ్చరించారు. ‘మీ బాబాయ్‌ని చంపినట్లు జనాన్ని చంపినా దిక్కు ఉండదనుకుంటున్నారు. అందరిని చంపి రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా?. నీ అధికారం అంతు తేలుస్తానని భీకర స్వరంతో అన్నారు. 545 మందిని గ్రామాల నుంచి వెలివేస్తే చిన్న సమస్యా?. తమాషానా.. తడాఖా చూపిస్తాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడా? అని ప్రశ్నించారు. చలో ఆత్మకూరు కార్యక్రమం ఆగదు. 127 ఎస్సీ కుటుంబాలపై రాక్షసంగా ప్రవర్తించారు. బాధితుల్ని పట్టుకొని పెయిడ్‌ ఆర్టిస్టులు అంటారా? అని ఫైర్ అయ్యారు. చలో ఆత్మకూరు బాధితులకు భరోసా తప్ప యుద్ధం కాదు. కౌంటర్‌ ర్యాలీలు, 144 సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అని జగన్ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.