ఆ పాటతో హీటెక్కించడానికి సిద్దమైన రకుల్

0
120

ప్రస్తుత సినిమాల్లో రీమిక్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. పాత సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ .. కొత్త హంగామా క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉంది. తాజాగా ఓ ఓల్డ్ సాంగ్ ని రీమిక్స్ చేస్తూ.. ఆ సాంగ్ లో చిందేయడానికి రెడీ అయింది టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ వివరాల్లోకి వెళితే .. 1988 లో హిందీలో వచ్చిన దయవన్ సినిమాలో ”చాహే మేరీ జాను .. తూ ..” అంటూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో అప్పట్లో సౌత్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ చిందులు వేసి ఆ పాటకు సూపర్ క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు అదే సాంగ్ ని మార్జావ అనే సినిమాలో రీమిక్స్ చేస్తున్నారు.

Image result for Dayavan movie ramya krishna

అయితే.. అప్పుడు రమ్యకృష్ణ అలరిస్తే.. ఇపుడు రకుల్ ఆడిపాడనుంది. మరి అప్పట్లోనే రమ్యకృష్ణ హాట్ హాట్ అందాలతో కిక్కెక్కించింది. మరి అంత హిట్ సాంగ్ లో రకుల్ ఆమెను మించేలా ఎంత హాట్ గా చిందులు వేస్తుందోనని టాక్. అన్నట్టు ఈ సాంగ్ కోసం ఈ అమ్మడు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఈ మద్యే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్న రకుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. హీరోయిన్ గానే కాదు ఇలా స్పెషల్ ఐటెం సాంగ్స్ కి కూడా ఓకే చెప్పేస్తూ ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకునే పనిలో పడింది ఈ అమ్మడు.