ఆయన పరిచయంతో కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది

0
81

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, మీటూ ఉద్యమకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్న చిన్మయి శ్రీపాద నేడు 35వ వడిలోకి అడుగుపెడుతున్నారు. సినీ కెరీర్‌తోనే సంతృప్తి చెందకుండా.. మీటూ ఉద్యమం ద్వారా ఆడవాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాడుతుంది. ఇండస్ట్రీలో పెద్దమనుషుల హోదాలో ఉండి ఆడవాళ్ళ పట్ల చెడుగా వ్యవహరించే వారిని సైతం నిర్మొహమాటంగా బయటకు లాగి లైంగిక వేధింపులపై చిన్మయి గళమెత్తారు. నేడు చిన్మయి పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ మరియు జీవిత విశేషాలు మీకోసం.

Related image

ముంబైలో పుట్టి, పెరిగిన చిన్మయి.. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె కుటుంబం చెన్నైకి వచ్చి స్థిరపడింది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో చిన్నప్పటి నుంచి సంగీత మెళకువలు నేర్చుకునేది. మద్రాస్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ చేసిన చిన్మయికి పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తమిళంతో పాటు తెలుగు,హిందీ, ఇంగ్లీష్,మరాఠీ,మలయాళం,జర్మన్ భాషలను ఆమె స్పష్టంగా మాట్లాడగలదు. అప్పట్లో సన్‌టీవీలో ప్రసారమైన సప్త స్వరంగళ్ అనే షోలో విజేతగా నిలవడం ద్వారా ఆమె ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. సింగర్ శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌ను పరిచయం చేయించారు.

Image result for chinmayi

అలా 2002లో అమృత సినిమాతో సింగర్‌గా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ పాటలు పాడారు. సింగర్‌గా ఎంత పేరు సంపాదించుకుందో.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. త్రిష, తమన్నా, నయనతార, కాజల్, అనుష్క, అమీ జాక్సన్ వంటి హీరోయిన్లకు ఆమె ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నారు. అందాల రాక్షసి సినిమా సమయంలో హీరో రాహుల్ రామకృష్ణకు, చిన్మయి ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారడం.. ఇరువురి కుటుంబాలు ఒప్పుకోవడంతో 2014,మే 5న వీరి వివాహం జరిగింది.