శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ యాసలో అదరగొట్టనున్న సాయిపల్లివి

0
91

క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘ఫిదా’మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఆ సినిమాలో భానుమతిగా సాయి పల్లవి అద్భుతమైన నటనను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది. అందుకే తన తరువాత సినిమాలోనూ సాయి పల్లవినే హీరోయిన్‌గా తీసుకున్నారు శేఖర్ కమ్ముల. అక్కినేని నాగచైతన్యతో శేఖర్ కమ్ముల సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

షూటింగ్ లొకేషన్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్‌డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏసియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్.. శేఖర్ కమ్ములకి స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య క్లాప్ ఇచ్చారు.