వారిద్దరూ ఓకే.. మరి కూతురు పరిస్థితి ఏంటి?

0
201

తెలంగాణ ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముగిసింది. ఎటువంటి సంచలనాలకు, అలకలకు తావు లేకుండా సింపుల్ గా కేసీఆర్ మేటర్ సెటిల్ చేశారు. పాతవారికి ఉద్వాసన పలకకుండా కొత్తగా ఆరుగురికి అవకాశం కల్పించారు. అయితే మొదటి దఫా మంత్రివర్గంలోకి తీసుకొని తన కొడుకు, అల్లుడిని ఈ దఫా తన టీమ్ లోకి తీసుకున్నాడు.

Related image

అయితే.. కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్, ఐటీ, పరిశ్రమల శాఖలనే తిరిగి అప్పగించారు. ఇక హరీశ్ రావు విషయానికొస్తే.. గతంలో భారీ నీటిపారుదల శాఖలను నిర్వహించగా, ప్రస్తుతం ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే, కొడుకు, మేనల్లుడికి కేబినెట్ బెర్త్‌లు ఇచ్చిన కేసీఆర్ మరి కుమార్తె కవితకు ఎలాంటి అవకాశం ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Image result for kcr kavitha

పార్లమెంట్ ఎన్నికల్లోకవిత ఓటమి పాలయిన విషయం తెలిసిందే. రాజకీయంగా మంచి పట్టు, తెలివితేటలు ఉన్నా.. కవిత నిజామాబాదు రైతుల పోరాటం ముందు తలవంచక తప్పలేదు. మొన్నామధ్య ఆమెకు రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలి పదవి కట్టబెడతారని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి కవితను పోటీచేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాను ఓడిపోయినా నిజామాబాద్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లబోనని కవిత స్పష్టం చేయడంతో.. కేటీఆర్ మంత్రివర్గంలోకి రావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ ఫోస్ట్‌ను కవితకు ఇస్తారే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ వార్తలన్నీ ఒకెత్తయితే.. కవితను రాజ్యసభకు పంపే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కేసీఆర్ తన కూతురు భవిష్యత్తును ఎలా లిఖించనున్నాడో వేచి చూడాల్సిందే.