‘రియల్‌మి’ అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్తే!

0
77

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మి’.. దాని అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది. ఈ కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌‌మి 5’ ఇకపై భారత్‌లో ప్రతీ మంగళవారం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుందట. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ ప్రకటించింది.

Image result for realme 5 pro

ఇదిలావుంటే.. ఆగస్టు 27న తొలిసారి ఈ ఫోన్‌కు ఫ్లాష్ సేల్ నిర్వహించగా 1,20,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత పలుమార్లు సేల్ నిర్వహించారు. రియల్‌మి 5.. 3 జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999, 4జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ ధర రూ.11,999.

Related image

రియల్‌మి 5 స్పెసిఫికేషన్లు: 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 ఎస్ఓసీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆడ్రాండ్ 9.0 ఓఎస్, 12 ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 13 ఎంపీ ప్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.