రాజధాని విషయంలో స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్

0
73

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ నేడు వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలోని కప్పరాడ హై స్కూల్‌లో మంత్రి ఈ రోజు అదనపు గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిలో పనులు ఆగలేదని.. అవినీతి మాత్రమే ఆగిందని వ్యాఖ్యానించారు. అవినీతి లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ఆయన అన్నారు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ కావాలన్నది సీఎం జగన్ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇళ్ల పేరిట టీడీపీ నాయకులు పేదలను దోచుకున్నారని.. పేదల అందరికీ ఇల్లు ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యమని.. ఒక్క రూపాయి లంచం కూడా తీసుకోకుండా సచివాలయంలో అర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీదే అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.