‘పాక్’ తన బుద్ది ఏమాత్రం మారదని ప్రపంచానికి తెలిసేలా చేసింది

ఉగ్రవాదం విషయంలో తన బుద్ధి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. ఇటీవల అరెస్ట్ చేసిన జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను ర

0
99

ఉగ్రవాదం విషయంలో తన బుద్ధి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. ఇటీవల అరెస్ట్ చేసిన జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను రహస్యంగా విడిచిపెట్టినట్టు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది. భారత్-పాక్ సరిహద్దులోని రాజస్థాన్- కశ్మీర్ సెక్టార్లో పెద్ద కుట్రకు పాక్ పావులు కదుపుతోందన్న ఐబీ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దులో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించింది. అయితే భారత్‌కు తగిన రీతిలో ధీటైన సమాధానం ఇస్తామని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు మసూద్‌ను వదిలిపెట్టినట్టు ఐబీ అనుమానిస్తోంది.