దెబ్బ తగిలినా.. ధవన్ ఆటిట్యూడ్ చూడండి.. ఆ పోస్ట్ చూడండి!

0
332

ప్రపంచకప్-2019లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో శిఖర్ ధావన్ తీవ్ర గాయం అయినా.. బ్యాటింగ్ అలాగే కొనసాగించి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధావన్‌కు మళ్లీ గాయమయినా.. అదేమీ లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసాడు. అంతేకాదు తన తోటి ఆటగాడితో జోక్ పేల్చాడు. వివరాల్లోకెళితే.. తాజాగా దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్-ఎ 4-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ 36 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగడంతో భారత్ 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా-ఏ 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.

Image result for dhawan

అయితే.. ఈ మ్యాచ్‌లో ధావన్‌కు గాయమైంది. పేసర్‌ హెండ్రిక్స్‌ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోని ఓ బంతిని ధావన్‌ స్కూప్‌ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ.. బంతి నేరుగా వచ్చి అతడి మెడకు బలంగా తగిలింది. గాయమైనా అతడు తన బ్యాటింగ్ కొనసాగించాడు. దీనికి సంబందించిన వీడియోను గబ్బర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసాడు. ‘మనం పడిపోతాం.. గాయపడతాం.. విఫలమవుతాం. అయినా.. తిరిగి పైకిలేస్తాం.. కోలుకుంటాం.. విజయం సాధిస్తాం’ అని రాసాడు. దీనిపై సంజు శాంసన్‌ కూడా స్పందించాడు. ‘ధావన్‌కు గాయమైన తర్వాత క్రీజులో ఉన్న నా దగ్గరికి వచ్చి.. బంతి పగిలిపోయిందేమో చూడు అని అన్నాడు’ అని కామెంట్‌ చేశాడు. ఏదేమైనా ధావన్ తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.