జోగు రామన్న ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి పదవి రాలేదని..

0
339

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పదవి ఇవ్వనందుకు ఓ కార్యకర్త తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అప్రమత్తమైన కార్యకర్తలు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే.. ‘నీలాంటి వాళ్ళ తప్పుల వల్లే రామన్నకు మంత్రి పదవి రాలేదు’ అని సీనియర్ నేత సాజిద్ ఖాన్‌పై కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు.. రామన్నకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆయన అనుచరులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మంత్రి పదవి దక్కకపోవడంతో జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. క్వార్టర్స్‌ ఖాళీ చేసి, గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. నేడు అసెంబ్లీకి కూడా జోగు రామన్న హాజరు కాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్టయింది.