చేతిపై ఉన్న ‘టాటూ’ ఎందుకు వేసుకున్నాడో చెప్పేసిన ‘నాగార్జున’

నాగార్జున చేతిపై వేసుకున్న టాటూ వేసుకుంది అందుకేనా…

0
83

కింగ్ నాగార్జున ట్రెండ్ కి తగ్గట్లు తనను తాను మలుచుకుంటూ తెలుగులో ప్రసారమవుతున్న  ‘బిగ్ బాస్ 3’ రియాల్టీ షోకు వ్యాఖ్యతగా నిర్వహిస్తున్నారు అయితే ఆదివారం నాడు ప్రసారమైన బిగ్ బాస్ షోలో నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ క్రమంలో నాగార్జున చేతిపై ఉన్న టాటూ ఒక్కసారి  చూపించాలని, అయితే ఈ టాటూ ఎందుకు వేసుకున్నారో చెప్పాలని కోరారు. హౌస్ మేట్స్ కూడా అడగడంతో నాగార్జున తన ఎడమ చేతిపై టాటూ దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూని చూపిస్తూ దానికి వివ‌ర‌ణ ఇచ్చారు.

”నాగుపాము కుబుసాన్ని విడిచిపెడుతుంది. నేను కూడా గతాన్ని గురించి అసలు పట్టించుకోను. ఏమి ఆలోచించను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుక్కుంటూ  ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్(దిక్సూచి)పైన ఉన్న ‘ఎన్’ అనే అక్షరం ఉత్తర దిక్కు కావొచ్చు లేదా నా పేరు కూడా కావొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీనర్ధం” అంటూ చెప్పారు నాగార్జున.

ఇక ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిననాని తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన నాని…ఆ సినిమా టీజర్ ను బిగ్ బాస్ కంటెస్టంట్ కు చూయించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.