గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళసై తొలిసారి ఏం మాట్లాడారంటే..

0
160

తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమ, పాలనా సంస్కరణల్లో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తొలిసారి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరు మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా స్పూర్తిదాయకమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బంగారు తెలంగాణ లక్ష్యం సాధించేందుకు ప్రభుత్వం పటిష్టపునాదులు వేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తో కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళసై అన్నారు.