గజ.. గజ.. గజ.. వణికిస్తున్న గద్దలకొండ గణేష్ అలియాస్ వాల్మీకి!

0
88

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ నేడు విడుదల చేసింది. ట్రైలర్ కి వెళితే.. ఈ మధ్యకాలంలో ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలెక్కడొస్తున్నాయంటూ ఓ ముసలావిడ చెప్పే డైలాగ్‌ తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఫాంహౌస్‌లో ఉన్న డాన్‌ని కాదురా.. ఫాంలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకోవాలని అంటూ అధర్వమురళి.. నాపైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోటి పందాలేస్తే సస్తరు అని.. ఏమ్రో మనం బతుకుతున్నమని 10మందికి తెల్వకపోతే..ఇగ బతుకుడెందుకు రా’ అంటూ వరుణ్‌తేజ్‌ చెప్పే డైలాగ్స్‌ క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులు ఈలలు వేసేలా చేస్తున్నాయి. ఈ సినిమాలో అధర్వ మురళి సినిమా దర్శకుడి పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతుండగా.. వరుణ్‌తేజ్‌ పక్కా మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ ఓ వైపు బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌.. మరోవైపు మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నరు.