అలా జరిగితే ‘సాహో’ కు భారీ నష్టాలే..

0
70

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసుకుంది. కాగా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కాబట్టి సాహో నష్టాల నుండి బయటపడాలి అంటే ఇంకా దాదాపు రూ. 40 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.

Image result for sahoo

ఇదిలావుంటే.. ఒక్క బాలీవుడ్ లో తప్పించి సాహో సినిమా మరెక్కడా వంద కోట్ల రూపాయలు వసూళ్లు సాధించలేదు. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాల్లో సాహో ఐదో స్థానంలో నిలిచింది. సాహో లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు నుంచి పది కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నది. ఎలా చూసుకున్నా సాహో కు కనీసం ముప్పై కోట్ల రూపాయల మేర నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది.