అగ్రరాజ్యానికి తాలిబన్ల హెచ్చరిక

అగ్రరాజ్యమైన అమెరికాకు తాలిబన్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దు చేయాలని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు మండిపడ్డారు. దీనివల్ల ఎక్కువ మంది అమెరికన్లు

0
93

అగ్రరాజ్యమైన అమెరికాకు తాలిబన్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.

అగ్రరాజ్యమైన అమెరికాకు తాలిబన్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో శాంతి చర్చలను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ కాబూల్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.

అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై తాలిబన్లు మండిపడ్డారు. దీనివల్ల ఎక్కువ మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతారని తాలిబాన్లు అన్నారు. మేరీల్యాండ్‌ క్యాంప్ డేవిడ్‌లోని అధ్యక్ష సమ్మేళనం వద్ద తాలిబాన్ ప్రధాన నాయకులతో డొనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా రహస్య చర్చలను రద్దు చేసిన కొన్ని గంటల తరువాత ఇస్లామిస్ట్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత వారం కాబూల్‌లో తాలిబన్లు జరిగిన దాడిలో ఒక అమెరికన్ సైనికుడిని, మరో 11 మందిని చంపినందుకు ట్రంప్ చర్చలు విరమించుకున్నారు. అయితే ట్రంప్ చర్చలు విరమించుకోవడాన్ని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపణలు గుప్పించారు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌పై దాడులు చేస్తున్నాయని జబీహుల్లా ఆరోపించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో శాంతి చర్చలు నిలిచిపోయాయని, తాలిబాన్ ఏదైనా ముఖ్యమైన కట్టుబాట్లను అనుసరించగలదని ఒప్పించే వరకు ఈ ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించుకోమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చెప్పారు.