సెరీనా తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించినపుడు ఆమె ఇంకా పుట్టలేదు.. కానీ నేడు గట్టి షాక్ ఇచ్చింది..

0
157

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ఫేవరెట్‌ సెరీనా విలియమ్స్‌కు ఫైనల్లో గట్టి షాక్ తగిలింది. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించి రెండో క్రీడాకారిణిగా ఉన్న ఆమె మార్గరెట్‌ కోర్ట్‌(24టైటిల్స్‌)ను సమం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ తుదిపోరులో ఓటమి తప్పలేదు. 19 ఏళ్ల కెనడియన్‌ స్టార్‌ బియాంక ఆండ్రిస్కూ ఆడిన తొలి ఫైనల్లోనే భీకర ఫామ్‌లో ఉన్న సెరీనాను 6-3, 7-5తో వరుస సెట్లలో ఓడించింది.

Image result for us open 2019

ఇదిలావుంటే.. బియాంకా ఇది వరకు ఏ ఇతర గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో రెండో సెట్‌ కూడా దాటలేదు. ఈమె కెనడా తరఫున తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించిన క్రీడాకారిణిగానూ రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఇకపోతే.. సెరీనా విలియమ్స్‌ మొదటి గ్రాండ్‌స్లామ్‌ సాధించినపుడు బియాంక ఇంకా పుట్టలేదంటే అతిశయోక్తికాదు.