బిగ్ బ్రేకింగ్: చంద్రయాన్-2 ల్యాండర్ ఆచూకీ దొరికింది: ఇస్రో

  చంద్రయాన్ -2 ప్రయోగానికి సంభంధించిన పురోగతి ఎట్టకేలకు లభించింది. చంద్రయాన్ 2 నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనుగొన్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. అయితే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. శనివా

  0
  148

  – విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనుగొన్న ఇస్రో

  – సిగ్నల్స్ ను పునరుద్దరిస్తామన్న ఇస్రో చైర్మన్

  – ఊపిరి పీల్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

  చంద్రయాన్ -2 ప్రయోగానికి సంభంధించిన పురోగతి ఎట్టకేలకు లభించింది. చంద్రయాన్ 2 నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో కనుగొన్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. అయితే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సాంకేతిక సంబంధాలు తెగిపోయాయి. అయితే ఈ ఏడాది జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్‌ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్‌ –2 ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ వేరుపడింది. చంద్రనిపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ల్యాండర్  నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో టెన్షన్ లో పడ్డ ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో తెలుసుకునే పనిలో పడ్డారు. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగానే ల్యాండ్ అయినట్లు, కానీ సాంకేతిక సమస్యల వల్ల సంబంధాలు తెగిపోయాయని ఇస్రో తెలిపింది. ఎట్టకేలకు చివరకు ల్యాండర్ ఎక్కడుందో తెలుసుకోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పిల్చుకున్నారు.