బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన కార్తిక్.. ఎందుకంటే..

0
150

భారత సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌.. బీసీసీఐ నింబంధనలు ఉల్లంగించడంపై బోర్డుకు ‘బేషరతుగా క్షమాపణలు’ చెప్పాడు. విషయమేమిటంటే.. బోర్డు కాంట్రాక్టు ఆటగాడు అయిన కార్తీక్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై బోర్డుకు బేషరతుగా కార్తీక్‌ క్షమాపణ చెప్పారు.

Image result for dinesh karthik cpl

బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడకు వెళ్లిన కార్తీక్‌.. ట్రిన్‌బాగో జట్టు జెర్సీ ధరించి.. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూచొని.. సీపీఎల్‌ మ్యాచ్‌లను తిలకించాడు. ట్రిన్‌బాగో జట్టు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ది కావడం.. అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఐపీఎల్‌లో దినేశ్‌ కార్తీక్‌ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా సీపీఎల్‌ జట్టు డ్రెసింగ్‌ రూమ్‌లో కార్తీక్‌ కనిపించడంతో అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీనిపై కార్తీక్ పై విధంగా స్పందించాడు.