తోక ఎన్నిసార్లు వంచినా మారని ‘పాక్’ బుద్ది

ఎన్ని సార్లు గుణపాఠం చెప్పినా...తన బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదన్న విధంగా ఉంది పాకిస్థాన్ తీరు. కశ్మీర్‌ విషయంలో.. అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిల

0
75

-విమానం వెళ్లేందుకు అనుమతి నిరాకరణ

-కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పాక్

ఎన్ని సార్లు గుణపాఠం చెప్పినా…తన బుద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదన్న విధంగా ఉంది పాకిస్థాన్ తీరు. కశ్మీర్‌ విషయంలో.. అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో.. భారత్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు పాకిస్థాన్‌ ఏ మాత్రం వదులు కోవడం లేదు. భారత్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, స్లోవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న ఉగ్రవాదంపై ఆయా దేశాల అగ్రనేతలతో చర్చలు జరపనున్నారు రాష్ట్రపతి. పర్యటనల్లో పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై దేశాధినేతలతో సమావేశమై చర్చించనున్నారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ ఆర్టికల్‌ 370 రద్దుతో పాటు.. రాష్ట్రపతి పుల్వామా దాడుల గురించి దేశాధినేతలతో చర్చించడం దాయాది దేశానికి ఏ మాత్రం మింగుడు పడటంలేదనే చెప్పాలి. కక్ష సాధింపుగా ఇందు కోసం పాక్ గగనతలంకు రాష్ట్రపతి విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది పాక్. భారత్‌ అభ్యర్థనను తాము సంపూర్ణంగా తిరస్కరిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారన్నారు పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి  షా మహ్మద్‌ ఖురేషీ. భారత్‌ వైఖరి కారణంగానే అభ్యర్థనను నిరాకరించామని పాకిస్థాన్‌కు చెందిన వార్తా సంస్థలకు తెలియజేశారు ఖురేషీ.