‘కేసీఆర్ టీమ్’లో కొత్త మంత్రులకు శాఖలివే..!

తెలంగాణ కేబినెట్ ను ఈరోజు విస్తరించిన విషయం తెలిసిందే. ఆరుగురు కొత్త మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వా

0
96

తెలంగాణ కేబినెట్ ను ఈరోజు విస్తరించిన విషయం తెలిసిందే. ఆరుగురు కొత్త మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ లకు స్థానం  కల్పించిన కేసీఆర్…కొద్ది సేపు క్రితం కొత్త గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.

ఆరుగురికి శాఖలివే…

హరీశ్ రావు -ఆర్థిక శాఖ

కేటీఆర్ – ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ

సబితా ఇంద్రారెడ్డి – విద్యా శాఖ

సత్యవతి రాథోడ్ -గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు

పువ్వాడ అజయ్ – రవాణా శాఖ

గంగుల కమలాకర్ – బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ కేటాయించినట్టు సమాచారం. కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణతో మంత్రుల సంఖ్య 18కి చేరింది.