కేసీఆర్ జట్టులో ఆరుగురు కొత్త మంత్రులు వీరే..!

తెలంగాణ కేబినెట్ విస్తరణ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో ఆరుగురు కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకా

0
98

-ప్రమాణ స్వీకారం చేయించిన కొత్త గవర్నర్

తెలంగాణ కేబినెట్ విస్తరణ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో ఆరుగురు కొత్త మంత్రులు కొలువుదీరారు. ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆరుగురు మంత్రుల పేర్లను ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్‌భవన్‌కు పంపింది. అందులో కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను ఖరారు చేశారు. కేటీఆర్‌కు పాత శాఖలనే కేటాయించే అవకాశం ఉంది. ఇక హరీశ్‌రావుకు కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరుగురు కొత్త మంత్రులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు.

కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్