కంటెస్టెంట్ కు షాకిచ్చిన ‘బిగ్ బాస్’ ఏడుపులతో దద్దరిల్లిపోయిన హౌస్

బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇదో రకమైన ఎంటర్‌టైన్మెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ఎంతో పాపులర్ అయింది. వాళ్లు కొట్టుకుంటుంటే అది చూసి మనం బయట ఎంజాయ్ చేస్తుంటాం. ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ల దగ్గర చాడీలు చెబుతుంటే ఇదేం

0
238

బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇదో రకమైన ఎంటర్‌టైన్మెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ఎంతో పాపులర్ అయింది. వాళ్లు కొట్టుకుంటుంటే అది చూసి మనం బయట ఎంజాయ్ చేస్తుంటాం. ఒకరి గురించి ఒకరు వేరే వాళ్ల దగ్గర చాడీలు చెబుతుంటే ఇదేం పని అని బయటి నుంచి మనం తిడుతూ ఉంటాం. మనకు అస్సలు సంబంధంలేని వ్యక్తుల గురించి టీవీలో చూసి మరీ అభిప్రాయాలు చెప్పేస్తూ ఉంటాం. మనమే ఆ ఇంటిలో ఉన్నట్లు ఫీలవుతూ ఉంటాం. అంతలా ఈ షో ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంది. అందుకే, అన్ని భాషల్లోనూ ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు కూడా ఉహించలేరు. శని, ఆదివారాలు వచ్చేసరికి ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చాలా ఆసక్తిగా చూసేందుకు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఎలిమినేట్  ఎవరు అయ్యారో తెలిశాఖ కొంత మంది ‘అయ్యో పాపం’ అంటారు. మరికొంత మంది లైట్ తీసుకుంటాం. కానీ, ఈ వారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఎలిమినేషన్ బిగ్ బాస్ లో చోటు చేసుకుంది. ఎవరు ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఈ సీజన్‌కు బలమైన కంటెస్టెంట్‌గా చెప్పుకుంటోన్న అలీ రెజా ఇంటి నుంచి బయటికి వచ్చేశారు.

అయితే ఏడోవారం ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్ అయిన విషయం తెలిసిందే. రాహుల్ శ్రీముఖి, సిప్లిగంజ్, మహేష్ విట్టా, అలీ రెజా, రవికృష్ణ నామినేట్ అయ్యారు. అయతే అలీ నామినేట్ కావడంతో ఈ సీజన్‌లో ఇదే మొదటి సారి.. అయితే, వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు శనివారం నాగార్జున ప్రకటించేశారు. ఆదివారం రోజున శ్రీముఖి సేఫ్ అయినట్లు ప్రకటించిన, ఇక ఎలిమినేషన్ కు వచ్చేశారరు.అలీ రెజా ఎలినిమనేషన్ అవుతున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. అలీ ఎలిమినేషన్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో  ఉన్న కంటెస్టెంటే కాకుండా ప్రేక్షకులు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా హౌస్ షాక్ అయ్యారు. ప్రత్యేకమైన 50వ ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ నమ్మలేని షాక్ ఇచ్చారు. కానీ, నమ్మితీరాల్సిందే.

అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో ఎవ్వరికీ నోటి మాట రాలేదు. మొదట శివజ్యోతి, శ్రీముఖి, హిమజలు షాకింగ్ కు గురయ్యారు. ఎవరి నోట్లో నుంచి మాటలు రాలేదు. ఇది నిజమా..? అబద్దమా..? అన్నట్లు అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక అక్కడి నుంచి శివజ్యోతి, శ్రీముఖిలు ఏడుపులతో హౌస్ అంతా దద్దరిల్లిపోయింది. ఒక్కరూ ఇద్దరు కాదు రవి, రాహుల్, వరుణ్ సందేశ్, హిమజా, ఇలా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి, శివజ్యోతి అయితే వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ స్ట్రాంగ్‌గా కనిపించే రాహుల్ అయితే చిన్న పిల్లాడిలా బోరున విలపించారు. ఇప్పటి వరకు ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినప్పుడు కనిపించని వాతావరణం అలీ బయటికి వెళ్తుంటే  స్పష్టంగా కనిపించింది. ప్రతి ఒక్కరు కన్నీళ్లతో సాగనంపారు. చివరికి అలీ స్టేజి  పైకి వచ్చిన తర్వాత నాగార్జున లైవ్ లో మాట్లాడించకుండా ఫోన్ ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడించారు. అయినా ఫోన్ లో కూడా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు.