ఓటమెరుగని న్యాయవాది ఇకలేరు

    0
    96

    ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ ఇక లేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం ఉదయం స్వగృహంలో కన్నుమూశారు. జెఠ్మలానీ 1923 సెప్టెంబర్‌ 14న సింధు ప్రావినెన్స్‌లోని సిఖర్‌పూర్‌లో జన్మించారు. న్యాయవాది వృత్తిలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చరిత్రలో లిఖించదగ్గ పలు కేసులను ఆయన వాదించారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసు, హర్షద్‌ మెహతా స్టాక్‌ మార్కెట్‌ వంటి పలు కేసులను ఆయన వాదించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన కేసు వాదిస్తే విజయం పక్కా అనే పేరు దేశవ్యాప్తంగా ఉందంటే తనెంత గొప్ప న్యాయవాదో అర్ధం చేసుకోవచ్చు.