ఆ కీచక కోచ్ కు 6 రోజులు రిమాండ్ విధించిన కోర్టు

    0
    536

    తన వద్దకు శిక్షణకై వచ్చే మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడిన గోవా స్విమ్మింగ్ కోచ్ సురాజిత్ గంగూలీకి గోవా కోర్టు 6 రోజులు రిమాండ్ విధించింది. సురాజిత్ ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతనికి 6రోజుల కస్టడీ విధించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ గజానన్ ప్రభుదేశాయ్ తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు సురాజిత్ పై కేసు నమోదు చేశారు. కేసు నమోదుతో పరారీలో ఉన్న సురాజిత్ ను గత శుక్రవారం న్యూఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సురాజిత్ ను గోవాలోని మపూసా పోలీస్ స్టేషన్ కు తరలించారు.