‘సైరా’ నుంచి టైటిల్ సాంగ్ రాబోతోంది

చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చారిత్రక చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ప్లాన్ వేస్తోంది చిత్ర యూనిట్.

0
75

చిరంజీవి కథానాయకుడిగా ‘సైరా’ తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చారిత్రక చిత్రాన్ని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ప్లాన్ వేస్తోంది చిత్ర యూనిట్. కర్నూల్ లో ఈ వేడుకను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుల ఏ రోజుల అనేది ఇంకా ఖరారు కాలేదు.

అయితే ఈ వేడుకకి ముందుగానే ఈ సినిమా నుంచి ‘సైరా నరసింహా రెడ్డి’ అనే టైటిల్ సాంగును విడుదల చేయనున్నట్టుగా సమాచారం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటను అద్భుతంగా రాశారనీ, 5 నిమిషాలకి పైగా ఈ పాట ఉంటుందని చెబుతున్నారు. మంచి ఊపుతో .. దేశభక్తిని ప్రేరేపిస్తూ రోమాలు నిక్కబొడిచేలా ఈ పాట సాగుతుందని అంటున్నారు. బెంగుళూర్ లోను భారీగా ఒక వేడుకను నిర్వహించాలనీ, ఆ తరువాత చెన్నైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.