వారంలోగా తొలగించాలి.. లేదంటే..

    0
    103

    యాదాద్రి స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మలు చెక్కడం పట్ల ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నామని.. వారంలోపు తొలగించకపోతే భారతదేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామన్నారు. యాదాద్రిని ప్రజల సొమ్ముతో నిర్మించారని.. మీ సొంత సొమ్ముతో నిర్మిచలేదని ఫైర్ అయ్యారు. అలాగే.. సీఎం కేసీఆర్ యాదాద్రిని ప్రపంచస్థాయి క్షేత్రంగా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. రాష్ట్ర నాయకత్వంతో చర్చించి యాదాద్రిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.