‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ గోల చేస్తున్న డైరెక్టర్!

0
81

‘పెళ్ళి చూపులు’ సినిమాతో దర్శకుడిగా సుపరిచితుడైన తరుణ్‌ భాస్కర్‌.. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో హీరోగా మారుతున్నాడు. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి నిర్మాత కావడం మరో విశేషం. ‘కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో.. రౌడీ హీరో మార్క్‌ ‘మసాలా’ సినిమాలో వుంటుందా.? లేదా.? అన్నదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదుగానీ, వాటి గురించి మాత్రం బాగానే ఆశించొచ్చు. తనను ఇండస్ట్రీకి సోలో హీరోగా పరిచయం చేసిన తరుణ్ ను హీరోగా మారుస్తూ విజయ్‌ దేవరకొండ చేసే ఈ ప్రయత్నంలో మాత్రం విజయం సాధించాలని ఆశిద్దాం. అనసూయ, వాణీ బోజన్‌, అవంతిక మిశ్ర, పావని గంగిరెడ్డి ఈ సినిమాలో నటిస్తోన్న మిగతా ముద్దుగుమ్మలు.