మరికాసేపట్లో జాతినుద్దేశించి మోదీ ప్రసంగం..

    0
    66

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. విజయపుటంచుల్లో సిగ్నల్‌ కట్‌ కావడంతో ధైర్యం, స్థైర్యం కోల్పోవద్దని శాస్త్రవేత్తలందరికి మోదీ తెలిపారు. చంద్రయాన్-2 అంశంపై నేడు ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.