భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారు: మోదీ

    ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ ప్రసంగించారు. నేడు ఆయన ఇస్రో కేంద్రం నుంచి ప్రసంగించారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని..

    0
    87

    ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ ప్రసంగించారు. నేడు ఆయన ఇస్రో కేంద్రం నుంచి ప్రసంగించారు. భారతమాత కోసం శాస్త్రవేత్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. వారి కుటుంబాలకు తమ సెల్యూట్‌ తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి శాస్త్రవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రవేత్తల బాధను తానూ పంచుకుంటున్నానని అన్నారు. దేశం పట్ల శాస్త్రవేత్తలకు ఉన్న నిబద్ధత ఎంతో గర్వించదగిందన్నారు. చంద్రుడికి మనం దగ్గరగా వెళ్లామని.. భవిష్యత్‌లో మనం మరిన్ని ప్రయోగాలు చేయాలన్నారు. అయితే ఇదెంత మాత్రం వెనుకడుగు కానే కాదని.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు గర్వపడుతున్నామని, శాస్త్రేవేత్తలు ఏ మాత్రం అదైర్య పడవద్దని అన్నారు. మీరు సంతోషించే మరెన్నో అవకాశాలు మున్ముందు వస్తాయన్నారు. ఈ రోజు మనకు ఎదురైన పాఠాలు… మనల్ని మరింత ధృఢంగా తీర్చిదిద్దుతాయన్నారు. ప్రతి సమస్య మనకు కొత్త విషయాలను నేర్పుతుందని, సాధించిన ఫలితాలతోపాటు… సాగించిన కృషి కూడా గుర్తించాలన్నారు. చంద్రయాన్‌-2 విషయంలో శాస్త్రవేత్తలు గొప్ప ప్రయత్నం చేశారని ప్రసంశించారు. సైన్స్‌లో ఫెయిల్యూర్‌ అనే మాటే లేదని, మన విజయాలకు భారీ కొలమానాలు పెట్టుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.