ప్రగతి భవన్ వద్ద పద్మాదేవేందర్ రెడ్డికి ఊహించని షాక్!

0
299

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ నరసింహన్‌కు ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభ కోసం పద్మాదేవేందర్ రెడ్డి అక్కడకు వెళ్లారు. అయితే.. ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో షాక్‌కు గురైన పద్మాదేవేందర్ రెడ్డి నిరాశగా వెనుదిరిగారు. ఇదిలావుంటే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్‌‌కు మాత్రం సభకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అతనికి ఎటువంటి పదవి లేకపోవడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ హోదా కలిగిన తనకు అనుమతి ఇవ్వకపోవడంతో పద్మాదేవేందర్ రెడ్డి విస్మయానికి గురయ్యారు. చాలా సేపు వేచి చూసినా కూడా ప్రగతి భవన్‌లోకి అనుమతించకపోవడంతో ఆమె నిరాశగా వెళ్లిపోయారు.